– 7 హోటళ్ల లైసెన్స్‌లు సస్పెండ్, లైసెన్స్ లేని హోటల్ సీజ్
నల్లగొండ రూరల్, అక్టోబర్ 14 : జాతీయ రహదారి–65పై హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాల్లో టీజీ ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ప్రత్యేక ఆహార భద్రత తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. మొత్తం 10 ప్రత్యేక బృందాల్లో సుమారు 60 మంది అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మొత్తం 20 ఆహార వ్యాపార సంస్థలను తనిఖీ చేసి, పరీక్షల నిమిత్తం 20 ఆహార నమూనాలను సేకరించారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన ఏడు సంస్థల లైసెన్స్‌లను సస్పెండ్…