తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, అధికారం చేపట్టిన టీవీకే పార్టీ డొనేషన్ల వివరాలను వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆ పార్టీకి 13 కోట్ల 30 లక్షల రూపాయల విరాళం వచ్చినట్లు పేర్కొంది. అందులో ప్రస్తుతం మంత్రులు ఆధవ్ అర్జున, ఆర్వీ రంజిత్ కుమార్ ఇద్దరే 99 శాతం విరాళాలు ఇచ్చినట్లు ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొంది.
రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అర్జున ఒక్కరే ఏకంగా 8 కోట్ల 20 లక్షల విరాళాలు అందజేశారు. ఆయన తర్వాత మరో మంత్రి రంజిత్ 5 కోట్లు పార్టీకి ఇచ్చారు. పార్టీకి 2025-26లో వచ్చిన విరాళాలలో అర్జున కంట్రిబ్యూషనే దాదాపు 60 శాతంపైగా ఉంది. వీరిద్దరికి తోడు మరో ఇద్దరు నేతలు చెరో 5 లక్షల విరాళాలు ఇచ్చారు.