లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎస్పీ రెబెల్ ఎమ్మెల్యేలు రాకేష్ ప్రతాప్ సింగ్, అభయ్ సింగ్, వినోద్ చతుర్వేది బీజేపీలో చేరారు. బుధవారం (అక్టోబర్ 14) సీఎం యోగి సమక్షంలో ఈ ముగ్గురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
రాకేష్ ప్రతాప్ సింగ్ అమేథీలోని గౌరీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అభయ్ సింగ్ అయోధ్యలోని గోసైన్‌గంజ్, వినోద్ చతుర్వేది జలౌన్‌లోని కల్పి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఈ ముగ్గురు సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్లపై గెలిచారు. అనంతరం పార్టీ హైకమాండ్ పై తిరుగుబావుటా ఎగరేశారు. ఇందులో భాగంగానే 2024 రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు.