ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియలో మొత్తం 25,819 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి ప్రకటించింది. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన నిన్న ఒక్కరోజే భారీగా 17,291 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం.చివరి రోజు అందిన నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే, 13 నగరపాలక సంస్థల్లో మేయర్ పదవుల కోసం 244 మంది, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఛైర్పర్సన్ పదవుల కోసం 765 మంది నామినేషన్లు వేశారు. అలాగే కార్పొరేటర్ స్థానాలకు 5,532, కౌన్సిలర్ స్థానాలకు 10,750 నామినేషన్లు చివరి రోజున అభ్యర్థుల నుంచి…