మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
విశాలాంధ్ర, మల్కాజిగిరి : ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మల్కాజిగిరి చౌరస్తా నుంచి ఆనంద్‌బాగ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన ఓటర్ల హక్కులను కాలరాయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగింపునకు గురైన అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించి…