హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి బడ్జెట్లో కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిధుల వ్యయంలో వెనుకబడిన శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయం, వైద్యం, ఇంధనం, పంచాయతీరాజ్ సహా కీలక శాఖల కార్యదర్శులతో వెంటనే సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆర్థికశాఖలో సంసరణలు అమలు చేయాలని, ఆదాయ వనరుల సమీకరణతోపాటు రుణాల పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా వ్యయ నియంత్రణ పాటిస్తూనే, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూడాలన్నా రు. ఆర్థిక నిర్వహణలో అనుభవజ్ఞులైన నిపుణులు, కన్సల్టెంట్ల సలహాలలు తీసుకోవాలని కోరారు. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన వర్గాలకు చేరేలా పర్యవేక్షణ ఉండాలని స్పష్టంచేశారు.