ట్రాయ్ కొత్త నిబంధనలకు అనుగుణంగా మూడు వాయిస్-ఓన్లీ ప్లాన్స్‌ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. రూ. 185 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 28 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్టెల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్, 300 SMSలు పొందొచ్చు. కొత్తగా తీసుకొచ్చిన మూడు ప్లాన్లలో ఇదే చౌకైనది కావడం గమనార్హం. అయితే.. ఈ ప్లా్న్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే నెల రోజులు కాదు. కాల్స్ మాత్రమే చాలనుకునేవారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్ ఛాయిస్.
ఇక.. మరో రీఛార్జ్ ప్లాన్.. రూ. 203 ప్రీపెయిడ్ ప్లాన్. 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్‌తో పాటు 300 SMSలు లభిస్తాయి. రూ. 185 ప్లాన్ రీఛార్జ్ ప్లాన్‌కు, రూ.203 రీఛార్జ్ ప్లాన్‌కు ఒక్కటే తేడా. రూ. 185 కంటే రూ. 18 అదనంగా చెల్లిస్తే, కాలింగ్, SMS ప్రయోజనాలు యథాతథంగా కొనసాగడంతో పాటు, వినియోగదారులు రెండు రోజుల వ్యాలిడిటీని అదనంగా పొందుతారు. ఈ 28 రోజులు రీఛార్జ్ ప్లాన్ కంటే 30 రోజుల రీఛార్జ్ ప్లాన్ బెటర్ అనుకునే కస్టమర్లకు ఇది బెటర్ రీఛార్జ్ ఆప్షన్.