దేశ వ్యాప్తంగా ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. తిరువూరులో వేంచేసిన గౌరీకేదారీశ్వర ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ( అక్టోబర్ 17)న అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మ దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణా పారీణ. ఆ తల్లి అమృతహృదయం.. ఆ తల్లి చల్లని చూపులకోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. అందుకే ఆరాధించడానికి తిథి వార నక్షత్రాలు లేకపోయినా ఆశ్వయుజమాసంలో మొదటి తొమ్మిది రోజులు తిరువూరు గౌరీదేవి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శరమిస్తున్నారు. అమ్మవారిని కొలిచినవారికి కోటిజన్మల పాపం భస్మమవడమే కాకుండా పుణ్యం లభిస్తుందని వేద పండితులు అరిపిరాల అప్పయ్యశాస్త్రి తెలిపారు.