Govt Land | బడంగ్పేట్, అక్టోబర్ 19 : సర్కార్ భూమిని కాజేసేందుకు కబ్జాదారులు పెద్ద స్కెచ్చే వేశారు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట పరిధిలోని కుర్మల్‌గూడలో రూ.90 కోట్ల విలువ చేసే ఐదెకరాల ప్రభుత్వ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్నారు. కరెంటు మీటర్ తీసుకుంటే జీవో 59 కింద దరఖాస్తు చేసుకోవచ్చని ప్లాన్ చేశారు. ఇంకేముంది రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు వేశారు. ఏకంగా పైపులైన్లు తీశారు. ఎలాంటి పత్రాలు లేకుండానే విద్యుత్ అధికారులు కరెంట్ మీటర్లు, కనెక్షన్ వచ్చేశాయి. ఇంకేముంది ఆ వ్యవసాయం చేస్తున్నట్టు నమ్మించి ఆ ఐదెకరాల పొలం తనదేనంటూ అక్రమదారుడు బుకాయించాడు. ఈ విషయమై అనేకమార్లు రెవెన్యూ అధికారులు…
అధికారులు దసరా పండుగ సమయంలో బిజీగా ఉంటారని గ్రహించిన కబ్జారాయులు.. వారి కండ్లుగప్పి కబ్జా చేదామని పెద్ద స్కెచ్ వేశారు. ఇంకేముంది 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి సరిహద్దులు ఫిక్స్ చేసుకున్నారు. వ్యవసాయం చేస్తున్నట్టు నమ్మించి రికార్డుల్లో నమోదు చేయించుకోవాలని ఎత్తుగడ వేసుకున్నారు. కరెంటు మీటర్ తీసుకుంటే జీవో 59 కింద దరఖాస్తు చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇంకేముంది కథ మొదలుపెట్టారు. ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కంకణం కట్టుకున్నారు. 59 జీవో ద్వారా ధరఖాస్తులు చేసుకోవాలంటే ఏదో ఒక అధారం ఉండాలనే ఉద్దేశంతో కరెంటు మీటర్ తీసుకున్నారు.