హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇకపై తాగునీటి బోర్లకే పర్మిషన్ ఇస్తామని సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడేవారిపై 'హైడ్రా' సహాయంతో స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో తాగునీరు, విద్యుత్ కొరత రాకుండా జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధిగకారులను సీఎస్ ఆదేశించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఏఎస్ అధికారులతో మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోయినా వ్యవసాయానికి, గృహాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని.. పరిశ్రమలకు పవర్ కట్ లేదని సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో…
సీఎస్ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేకపోవడంతో వచ్చే 110 ఎంజీడీ(మిలియన్ గాలెన్స్ పర్ డే)ల లోటును భర్తీ చేసేందుకు మిషన్ భగీరథ నుంచి 60 ఎంజీడీలు, కృష్ణా నీటిని మళ్లిస్తున్నామని వివరించారు. నవంబర్ 1 నుంచి నిర్మాణ రంగానికి ఎస్టీపీ వాటర్ గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలు చేస్తున్నామని వికాస్ రాజ్, నల్గొండలో ఉపాధి హామీ పనులు పెంచుతున్నామని హరిచందన, కరీంనగర్లో జూన్ వరకు తాగునీటి తిప్పలు లేవని బీడీ ఎక్కా, ఆదిలాబాద్లో పశుగ్రాసం కొరత రాకుండా చూస్తున్నామని ఇలంబర్తి…