గత వారం రోజులుగా తీవ్రమైన ఎండలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో అక్కడక్కడా…