హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రజలు సొంతూర్లకు వెళ్తుండటంతో శనివారం (అక్టోబర్ 17) రాత్రి హైవేపై వాహనాలు రద్దీ నెలకొంది.
రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో చౌటుప్పల్ దగ్గర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చౌటుప్పల్కు దాదాపు 3 కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ నెలకొంది. దీంతో చౌటుప్పల్ దాటేందుకు వాహనాలకు 45 నిమిషాల సమయం పడుతోంది.