పర్యావరణానికి హానికారక ఉద్గారాలను తగ్గించేందుకు నిరంతరం పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ20 ఇంధనం కొంత సేఫ్ అని భావిస్తున్నప్పటికీ దాన్ని తయారీ చేసే విధానం ఎంతో ఖర్చుతో, ఎక్కువ నీటి వినియోగంతో కూడుకున్నది కావడం సవాలుగా మారింది. ఈ క్రమంలో వెదరుతో చేసే ఇంధనం భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు తెస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. బైకు నుంచి ఫ్లైట్ వరకు భవిష్యత్తు ఇంధనంగా చెప్తున్న బ్యాంబూ ఫుయెల్ గురించి తెలుసుకుందాం.
వోర్సెస్టర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ (WPI) పరిశోధకులు చేసిన కొత్త రీసెర్చ్ ప్రకారం, బ్యాంబూ (వెదురు) ఆధారిత ఇంధనం భవిష్యత్తులో వాహనాలు, విమానాలు, రైళ్లకు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇది ఫాసిల్ ఇంధనాలతో పోలిస్తే చాలా తక్కువ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను వెలువరిస్తుంది.