నల్లగొండ, అక్టోబర్ 16 : చంద్రబాబు ఏమో వ్యవసాయం దండుగా అన్నాడు. ఆయన శిష్యుడు రేవంత్ ఏకంగా పంటలు సాగు వద్దు అని ప్రకటిస్తున్నాడు. ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురు శిష్యులు ఇద్దరు కలిసి తెలంగాణ రైతాంగంపై కుట్రలు పన్నుతున్నట్లు తెలిపారు. శుక్రవారం శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైటీపీఎస్, కొత్తగూడెం ప్లాంట్, సింగరేణి ప్లాంట్ లకు కూడా బొగ్గు సరఫరా చేయడం లేదన్నారు. రేవంత్రెడ్డి బొగ్గును అంతా ప్రైవేటుకు అమ్ముకుంటున్నట్లు తెలిపారు. నిన్నటి ప్రెస్మీట్లో రేవంత్ రెడ్డి కరువును…
నీళ్లు, కరెంట్, ట్ వ్యవసాయంపై కనీస అవగాహన లేని దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి అన్నారు. బొగ్గు ఇస్తే యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో భేషుగ్గా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు, మరి బొగ్గు ఎందుకు ఇయ్యడం లేదని ప్రశ్నించారు. మన బొగ్గును ఆంధ్రా, కర్ణాటకకు అమ్ముకుంటున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి. భట్టి విక్రమార్క ఇద్దరు తోడు దొంగలే అన్నారు. రూ.800 కోట్ల భారీ స్కామ్ చేస్తున్నారన్నారు. బొగ్గు దూరంగా ఉన్న విజయవాడలో, కడపలో థర్మల్ ప్లాంట్ లు కట్టలేదా అన్నారు. అటువంటిది దామరచర్లలో కడితే కడుపు ఎందుకు మoడుతున్నదన్నారు. రేవంత్ రెడ్డికి కమీషన్ లు రావాలి. అందుకే ఈ డ్రామాలు అన్నారు.