విశాలాంధ్ర ధర్మవరం;: రెజ్లింగ్ రాష్ట్రస్థాయికి విద్యార్థినీలు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్10 తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగినటువంటి. రెజ్లింగ్ రాష్ట్రస్థాయి పోటీలు కారంపొడి మండలం జడ్పీ.హెచ్.ఎస్ స్కూల్లో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి పోటీలలో ధర్మవరం జీవి ఈ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ధర్మవరం విద్యార్థినిలు పాల్గొని మైనస్ 33 కేజీ సెమీఫైనల్స్ వరకు పోరాడి సింధు బ్రాంచి మెడల్ సాధించడం జరిగింది అని తెలిపారు.అలానే అండర్ 17 మైనస్ 49 కేజీ విభాగంలో సిందే.డమరేశ్వరి ఫైనల్స్ వరకు పోరాడి సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది అన్నారు. అలానే బాలిగోళ్ళ.…