Jailer 2 | తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ జైలర్ 2 (Jailer 2) . నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో బ్లాక్ బాస్టర్ మూవీ జైలర్‌కు కొనసాగింపుగా తెరకెక్కిన పార్ట్ 2లో తలైవా ముత్తువేళ్ పాండ్యన్‌గా మరోసారి తనదైన మార్క్‌ను చూపిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. జైలర్ 2లో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్, మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్‌తోపాటు బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటించారు.
తలైవా అండ్ ఈ స్టార్ యాక్టర్ల టీంను టాలీవుడ్ యాక్టర్ మోహన్ బాబు కలిశాడు. రజినీకాంత్, మోహన్ బాబు మంచి స్నేహితులని తెలిసిందే. జైలర్ 2 షూట్ లొకేషన్లో మోహన్ బాబు సందడి చేసిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. జైలర్ 2 క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కు మోహన్ బాబు వెళ్లాడు. షూటింగ్ బ్రేక్ టైంలో రజినీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఎస్జే సూర్య, జాకీ ష్రాఫ్‌లతో కలిసి సరదాగా చిట్ చాట్ చేశాడు. లెజెండరీ యాక్టర్లంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న స్టిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.