ఎల్నినో వల్ల ఈసారి వానల్లేక అటు దేశం, ఇటు తెలంగాణల ఎటుచూస్తే అటు కరువే దరువేస్తున్నది. చూస్తుండంగనే చెరువులు, డ్యామ్లు, రిజర్వాయర్లు, బోర్లళ్ల నీళ్లు ఇంకిపోతున్నయ్. చాలాచోట్ల నీటి జాడలేక చేతికచ్చిన పంటలు ఎండిఎరగప్పయితన్నయ్. వచ్చే ఏడెనిమిది నెలలు జనానికి గుక్కెడు తాగునీరు ఎట్లా ఇవ్వాల్నో తెల్వక సర్కారు తలపట్టుకుంటున్నది. ఇట్లాంటి టైంల ఓ ప్రాంతం మాత్రం కళకళలాడే చెరువు, నిండుకుండలాంటి బాయి, గలగలపారే కాల్వలు, పైపులైన్లతో వందల ఎకరాల్లో పచ్చదనంతో అలరారుతోంది. అది సహజంగా జరిగితే అద్భుతమే. కానీ పదేండ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకొని , వందల కోట్ల జనం సొమ్ముతో ఒక్క వ్యక్తి తన సొంతానికి చేసుకున్న…
పాండురంగ చెరువు నుంచి నీళ్లు మళ్లించడానికి వ్యవసాయ శాఖ నుంచి భారీగా నిధులను ఖర్చుపెట్టారు. దీనికి నిదర్శనంగా 2016, 2017లో ఇచ్చిన మూడు జీవోలున్నాయి. 2016 జనవరి 5న ఇచ్చిన జీవో 2 ప్రకారం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను మోడల్ గ్రామాలుగా గుర్తించి వీటిలో 3వేల ఎకరాల్లో బిందుసేద్యం కోసం ఏర్పాట్లు చేయాలి. ఇందుకు100 శాతం సబ్సిడీ ఇస్తూ మొత్తం ఖర్చు సర్కారే పెడుతుందని చెప్పారు. మొదట్లో 42.54 కోట్లతో పాలన అనుమతి ఇచ్చారు. తర్వాత 2016 ఏప్రిల్ 7న జీవో 149 జారీ చేశారు.