JD Vance : భారతదేశం (India) విషయంలో తాను హద్దులు దాటానని అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. తాను ఆ పదం వాడి ఉండాల్సింది కాదని అన్నారు. ఇటీవల కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys), టాటా (TATA), విప్రో (WIPRO), హెచ్సీఎల్ (HCL), క్యాప్జెమిని (Capgemini) కంపెనీలను పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేసిన సందర్భంగా వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై తాజాగా వాన్స్ స్పందించారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భారత్ విషయంలో అప్పుడు తాను హద్దులు దాటి మాట్లాడానని అన్నారు. ‘విదేశీ ఒప్పంద పనివాళ్లు’ అని తాను వాడిన పదం సరైనది కాదని ఒప్పుకున్నారు. తన ప్రసంగంలో ఏమైనా లోపాలు ఉంటే.. అది తన తప్పేనని అంగీకరించారు. అయితే హెచ్-1బీ వీసాదారులను లక్ష్యంగా చేసుకోవాలనేది తన ఉద్దేశం కాదని చెప్పారు.