విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు ఘనంగా ఆయుధ పూజ జరిగింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అత్యంత భక్తి శ్రద్ధలతో జిల్లా ప్రజలు మరియు జిల్లా & రాష్ట్ర పోలీసులు సుఖఃశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం పోలీసు ఆయుధాగారంలోని పోలీసులు దైనందిన విధుల్లో వినియోగించే అన్నిరకాల ఆయుధాలకు… మోటారు ట్రాన్సుపోర్ట్ విభాగంలోని వివిధ రకాల వాహనాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకూడదంటూ ప్రార్థిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడారు. దుర్గా మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలు, పోలీసులు… ఇలా అన్ని వర్గాల…