న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు ముందు జియో ప్లాట్‌ఫామ్స్‌కు యాంకర్ బుక్ భలే కిక్కిచ్చింది. ప్రీ-క్వాలిఫైడ్ సంస్థాగత మదుపర్ల (యాంకర్ ఇన్వెస్టర్లు) నుంచి ఏకంగా 30 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి మరి. ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రూ.8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించి బుకింగ్‌కు వీలు కల్పించారు. అయితే దాదాపు రూ.2.5 లక్షల కోట్లకు సరిపడా బిడ్డింగ్ జరుగడం గమనార్హం. దీంతో బుధవారం (ఈ నెల 21) నుంచి మొదలయ్యే ఐపీవోలో రిటైల్ మదుపర్ల నుంచి విశేష స్పందన ఖాయమన్న అభిప్రాయాలు మార్కెట్ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా యాంకర్ బుక్ విజయాన్నిబట్టే…
సంస్థాగత మదుపర్లలో.. గ్లోబల్ అసెట్ మేనేజర్లు, సావరిన్ వెల్త్ ఫండ్లు, భారతీయ మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరర్లు, పెన్షన్ ఫండ్లు.. యాంకర్ బుక్‌లో పాల్గొన్నట్టు సమాచారం. వీరిలో బ్లాక్‌రాక్, క్యాపిటల్ గ్రూప్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, టీ. రో ప్రైస్, స్క్రోడర్స్, జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్మెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్వెస్కో, జానస్ హెండర్సన్ తదితర విదేశీ అసెట్ మేనేజర్లతోపాటు సింగపూర్‌కు చెందిన జీఐసీ, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, నార్వే నోర్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ వంటి సావరిన్ వెల్త్ ఫండ్లు, పబ్లిక్…