2026 రిక్రూట్మెంట్లో భాగంగా యూకో (UCO) బ్యాంక్ 1961 అప్రెంటిస్ చట్టం (Act) ప్రకారం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశంలోని పలు రాష్ట్రాల్లో 530 పోస్టులను నింపనుంది. వీటిలో తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్‌లో 8 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అర్హతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు తెలంగాణ- 8 (SC-1, OBC-2, UR-5) ఆంధ్రప్రదేశ్- 8 (SC-1, OBC-2, UR-5) పశ్చిమ బెంగాల్- 86 ఉత్తరప్రదేశ్- 45 ఒడిశా- 41 రాజస్థాన్- 37 బిహార్- 34 మహారాష్ట్ర- 32 మధ్యప్రదేశ్- 27 హిమాచల్‌ప్రదేశ్- 25 అస్సాం- 24 పంజాబ్- 24 తమిళనాడు- 21 గుజరాత్- 20 పై వాటితో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తం 530 అప్రెంటిస్‌ల నియామకాలు చేపట్టనున్నారు.