సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లపై మరో ఊహించని భారాన్ని మోపింది. ఒకవైపు పాత బకాయిలు, చేసిన పనులకు సంబంధించి వేల కోట్ల రూపాయల బిల్లులు రాక గుత్తేదారులు అప్పుల ఊబిలో విలవిలలాడుతుంటే, వారి నడ్డి విరిచే విధంగా ఈ-ప్రొక్యూర్మెంట్ చార్జీల పేరుతో సరార్ మరొక పిడుగును విసిరింది. ఈ-ప్రొక్యూర్మ్మెంట్ టెండర్లలో ఫీజుల విధింపునకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఐఈటీఈ సవరణలతో జీవో నంబరు 6ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి…
ఇప్పటివరకు భారీ బడ్జెట్ టెండర్లపై కాంట్రాక్టర్లకు అప్పర్ క్యాప్ ఉండేది. ఉదాహరణకు 50 కోట్ల లోపు ప్రాజెక్టులపై 10,000, ఆపై పనులపై రూ. 25,000 గరిష్ఠ రుసుము మాత్రమే వసూలు చేసేవారు. అయితే కొత్త జీఓ ప్రకారం ఈ గరిష్ట పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ప్రాజెక్టు విలువ ఎంత పెరిగితే దానికి తగినట్లుగా కాంట్రాక్టర్ల జేబులకు అంత పెద్ద కన్నం పడుతుందని కాంట్రాక్టర్ల అసోసియేషన్ మండిపడుతున్నది. కాగా గతంలో చిన్న పనులను ప్రోత్సహించేందుకు 10 లక్షల లోపు విలువైన టెండర్లకు ఈకార్పస్ నుంచి మినహాయింపు ఇచ్చేవారు. అయితే తాజా జీఓ ప్రకారం ఈ మినహాయింపును రద్దు చేశారు. ఫలితంగా చిన్న తరహా వర్లు చేసే…