దక్షిణాది సినీ, వ్యాపార వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది.ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. అందిన వివరాల ప్రకారం.. నవంబర్ 11న గ్రీస్‌లో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది.కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ పెళ్లిని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.అయితే, వివాహానికి సంబంధించిన వివరాలపై ఇరు కుటుంబాల నుంచి ఇప్పటివరకు…
సీఎం రేవంత్ రెడ్డికి పెళ్లి రిసెప్షన్ ఆహ్వానంఅయినప్పటికీ, పెళ్లి ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.తాజాగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న కావ్య మారన్-అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని రేవంత్ రెడ్డి దంపతులను ఆత్మీయంగా ఆహ్వానించారు.