కాంతి(బెంగాల్): భారత్లో బంగ్లాదేశ్ తరహా అశాంతిని సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆరోపించారు. కమ్యూనిస్టులు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమవారం తూర్పు మిడ్నాపూర్ జిల్లా కాంతిలో దుర్గాపూజలో పాల్గొన్న సువేందు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కమ్యూనిస్టులు పూజలు చేయరని, పవిత్ర దారాలు కట్టుకోరని, తిలకం పెట్టుకోరని వ్యాఖ్యానించారు. అలాంటి వారి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే దుర్గాదేవిని ప్రార్థించినట్లు తెలిపారు. తాను గర్వంగా చెప్పుకునే సనాతన హిందువునని స్పష్టం చేశారు.