సందీప్ కిషన్ హీరోగా ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న చిత్రం ‘కరికాల’. కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘యుగంధర్ చెప్పిన కథ చాలా ఇంటరెస్టింగ్‌గా అనిపించింది. ఆరేడు నెలలుగా మా దర్శకుడు 24 గంటలు ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉంటూ వచ్చారు. ఈ చిత్రం నా కెరీర్ బెస్ట్ అవుతుందని నమ్ముతున్నా’ అని చెప్పాడు.