స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన కెరీర్లోనే ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును దక్కించుకున్నారు. దిగ్గజ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అధికారికంగా ఖరారైంది. ఎం.ఎస్. – ఎ లెగసీ ఆన్ స్క్రీన్ అనే టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నటిగా రష్మిక కెరీర్లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని రేపు (సెప్టెంబర్ 16న) ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముఖ్య…
ఇక, రష్మిక నటిస్తున్న ఇతర సినిమాల విషయానికొస్తే.. యాక్షన్ థ్రిల్లర్ మైసా నవంబర్ 27న విడుదల కానుండగా, విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా రణబాలి అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.