హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ ఫామ్‌హౌస్ బావినుంచి రైతులకు నీళ్లిస్తామని పీసీసీ చీఫ్మహేశ్గౌడ్తెలిపారు. రూ. కోట్ల ప్రజాధనంతో కట్టిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాల్వలు, పైపులైన్ల ద్వారా కేసీఆర్తన ఫామ్‌హౌస్‌కు నీటిని తరలించడం తీవ్ర అధికార దుర్వినియోగం కిందికి వస్తుందన్నారు. ఆయన వ్యవహారం చూస్తుంటే ఆనాటి రాజులు, బూర్జువాల కాలం గుర్తుకు వస్తున్నదని పేర్కొన్నారు. శనివారం ‘వీ6 వెలుగు’లో ‘కేసీఆర్ఫాంహౌస్కు మళ్లిన కొండపోచమ్మ’ హెడ్‌లైన్‌తో వచ్చిన కథనంపై మహేశ్‌గౌడ్ స్పందించారు.
కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోకి నీటిని తరలించేందుకు ఏకంగా 58 ఎకరాల్లో ఒక చెరువు, 3 ఎకరాల్లో బావిని తవ్వించడం, రూ.50 కోట్ల డ్రిప్‌ఇరిగేషన్ నిధులను సొంతానికి వాడుకోవడం క్షమించరాని నేరమన్నారు. ఆయన తీరు వల్ల చుట్టుపక్కల రైతులకు సాగునీరు అందని పరిస్థితి ఉందని మహేశ్‌గౌడ్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ చేసిన తప్పుల కారణంగా తెలంగాణ ప్రజలు అరిగోస పడ్తున్నారని, ఎలాంటి ప్రణాళిక లేకుండా లోపభూయిష్టంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కేసీఆర్ అక్రమంగా తరలిస్తున్న నీటిని అడ్డుకోవడంతోపాటు ఫామ్‌హౌస్‌లో ఉన్న అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకొని దళితులకు, పేదలకు పంచుతామని…