హైదరాబాద్, అక్టోబర్ 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని ప్రతి రైతు కుటుంబం ఇప్పుడు ఆలోచనలో పడింది. దీన్ని ధ్రువీకరిస్తూ శుక్రవారం ఓ తెలుగు న్యూస్ చానల్ నిర్వహించిన డిబేట్లో ఫోన్ ద్వారా పాల్గొన్న కరీంనగర్కు చెందిన బాల నారాయణ అనే రైతు.. కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. కాంగ్రెస్కు ఓటేసి తప్పుచేశామని, ఇందుకు కేసీఆర్ సార్ అందర్నీ క్షమించాలని లైవ్లోనే విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
డిబేట్లో బాల నారాయణ మాట్లాడుతూ ‘2023లో అనవసరంగా వంకరగా ఆలోచించి కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేసినం. క్షమించండి కేసీఆర్ సార్. ఇంకోసారి ఇలా జరుగదు. జీవితంలో కాంగ్రెస్కు ఓటెయ్యాలంటే, ప్రతి ఓటరు కూడా ఆలోచించే స్థాయికి ఇప్పుడు వచ్చిండు. తెలంగాణలో ఆణిముత్యాల్లాంటి మంచి ఇంజినీర్లు ఉన్నరు. వాళ్లు ఇచ్చే సలహాలు, సూచనలను సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటలేడు. తెలంగాణకు కాళేశ్వరం ఓ వరప్రదాయిని. అట్లాంటి ప్రాజెక్టును ఎండబెట్టిండు. ఇప్పుడు తిందామంటే కూడా బువ్వ దొరకని పరిస్థితి తెచ్చిండు. చివరికి నీళ్లు కొందామంటే కూడా దొరుకుతలేవు అనే మాటలు ఒక ముఖ్యమంత్రి నుంచి వస్తున్నయంటే ఇగ ఏమనాలె?’ అంటూ బాల నారాయణ నిప్పులు…