హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూళ్లలో క్లాసుకో టీచర్ను నియమించకుండా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామనడం పచ్చి మోసమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యాశాఖ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. నేటి ఆధునిక, సాంకేతిక యుగంలోనూ ఇంకా సింగిల్ టీచర్ బడులు కొనసాగడం అత్యంత విచారకరమని తెలిపారు.
శనివారం హైదరాబాద్లో అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య (ఏఐపీటీఎఫ్) దక్షిణ భారత రాష్ట్రాల సమన్వయకర్త సయ్యద్ షౌకత్ అలీ అధ్యక్షతన కేరళ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధుల సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శైలజానాథ్ మాట్లాడారు.