మేడ్చల్, అక్టోబర్17(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఘట్కేసర్, బోడుప్పల్, కీసర, మేడ్చల్ సర్కిళ్లలో నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. అయితే జలమండలిలో విలీనం చేసుకోవాలంటే ప్రభుత్వం ఎలాంటి బడ్డెట్ కేటాయించకపోడంతో జలమండలిలో నూతన సర్కిళ్లను విలీనం చేసుకునేందుకు జలమండలి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం జీవో ఇచ్చినందున నీటి సరఫరాను జలమండలి అధికారులు చేయాలని సర్కిళ్ల అధికారులు జలమండలి అధికారులను కోరుతున్న బడ్జెట్ లేకుండా ఎలా విలీనం చేసుకుంటామని అంటున్నట్లు తెలుస్తోంది. గతంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న 16 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.