కొత్తగా ఉద్యోగంలో చేరే యువతను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PM-VBRY) కింద ఒక్కొక్కరికి రూ. 15వేల వరకు నగదు ప్రోత్సాహకం అందించే ప్రక్రియను ఈపీఎఫ్ఓ (EPFO) వేగవంతం చేసింది. ఈ సహాయాన్ని రెండు విడతలుగా, మొదటి విడత ఆరు నెలల ఉద్యోగం తర్వాత అందించనున్నారు. అయితే కేవలం కంపెనీలో ఆఫర్ లెటర్ అందుకోగానే ఈ మొత్తం ఖాతాలోకి పడిపోదు. సర్వీస్ రూల్స్ పాటించాల్సిన ఉంటుందని EPFO నిబంధనలు పెట్టింది.
ఈ పథకం ద్వారా ఈపీఎఫ్ ఓ నుంచి రూ. 15 వేల ప్రోత్సాహకం పొందాలంటే.. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 మధ్య ఉద్యోగంలో చేరిన ఫ్రెషర్లు దీనికి అర్హులు. నెలకు లక్షలోపు జీతం ఉంటే రెండు విడతల్లో డీబీటీ ద్వారా ఈమొత్తం అందుతుంది. 6 నెలల సర్వీస్ , 12 నెలల కంటిన్యూగా ఉద్యోగం చేయడంతోపాటు ఆర్థిక అక్షరాస్యత అంటే డబ్బును దీర్ఘకాలిక పొదుపు చేయడం తప్పని సరిచేసింది. ఉద్యోగి చేరిన సంస్థ కచ్చితంగా ఈపీఎఫ్ఓ పరిధిలో ఉండటంతో పాటు, క్రమం తప్పకుండా పీఎఫ్ చలాన్లు (ECR) ఫైల్ చేయాల్సి ఉంటుంది.