హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి నిండా కుంభకోణాలు ఉన్నాయి అని నేను చెప్పిన. కాంగ్రెస్ చేసిన కుంభకోణాలని ప్రజల ముందు పెడితే రేవంత్ రెడ్డి నిన్న అడ్డగోలుగా మాట్లాడిండు. నువ్వు ఉత్తరం రాస్తే నేను విచారణకు ఆదేశిస్తా అన్నాడు. bమీడియా ముందు మాట్లాడుడు కాదు, దమ్ముంటే సింగరేణి కుంభకోణం పైన ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్లపైన విచారణ సిట్టింగ్ జడ్జితో చేయించాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు..