నమ్మించి ముంచిన కాంగ్రెస్‌పై సింగరేణి కార్మికులు కదంతొక్కారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖనిలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ సభకు పోటెత్తారు. సభకు ఒకరోజు ముందుగానే ప్రభుత్వం లాభాల వాటా ప్రకటించినా లెక్క చేయకుండా కేటీఆర్ మీటింగ్‌కు కదలివచ్చారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణిని అవినీతిమయంగా మార్చడం, కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేయడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, సంస్థ ప్రైవేటీకరణకు కుట్రలు చేయడం, వంటి అంశాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించగా, ఆయనతో గొంతు కలుపుతూ ‘సంస్థను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టేది లేదు’ అంటూ…
సింగరేణి బొగ్గును బుక్కిన బకాసురుడెవరు?.. బొగ్గును మాయం చేసిన మాయల ఫకీరెవరు?.. సింగరేణి కోల్‌ను గోల్మాల్ చేస్తున్న దొంగెవరు? .. సిరుల గనిని స్కామ్‌ల ఖనిగా మార్చిన దుర్మార్గుడెవరు?.. మూడేండ్లలో సింగరేణిలో బొగ్గు నిక్షేపాలు తగ్గినయా?.. కార్మికుల కష్టం తగ్గిందా? మరి బొగ్గెందుకు తగ్గింది?