కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. మున్సిపల్ ఛైర్మన్ స్థానంతో పాటు, వార్డు కౌన్సిలర్ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో కుప్పంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ తరఫున రాజ్ కుమార్, వైసీపీ తరఫున గణేశ్ తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.ఇక కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డు కౌన్సిలర్ స్థానాలకు గాను మొత్తం 282 నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా తెలుగుదేశం పార్టీ 146 నామినేషన్లు దాఖలు చేయగా, వైసీపీ…