న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి వ్యతిరేకంగా మరో వేదిక ఏర్పడింది. లాల్ హిట్ జనతా పార్టీ (ఎల్జేపీ) పేరుతో కొత్త సమూహం లాంచ్ అయ్యింది. ఆదివారం ఢిల్లీలోని మాల్వీయ స్మృతి భవన్లో మొదటి సభ్యత్వ సమావేశాన్ని నిర్వహించింది. (Lal Hit Janata Party) ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో ‘లాల్ హిట్ జనతా పార్టీ’ని ఏర్పాటు చేసినట్లు దాని అధినేత అయాన్ భట్నాగర్ తెలిపారు. సీజేపీ, కాంగ్రెస్, నిరసనకారులను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. వారి నిరసన ప్రదర్శనలు దేశ రాజ్యాంగ సంస్థలను ప్రశ్నించాయని, వ్యాపారాలకు తీవ్ర నష్టం కలిగించాయని ఆయన ఆరోపించారు.
కాగా, తమ బృందం భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించడానికి, తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించగలమని నిరూపించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అయాన్ భట్నాగర్ తెలిపారు. ప్రధాని మోదీ జన సమీకరణకు పిలుపునిస్తే ఎంత మంది గుమిగూడతారోనని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దసరా పండుగ అత్యంత కీలకమైన వ్యాపార సీజన్ అని అన్నారు. ఢిల్లీతో సహా పలు మహానగరాల్లో నిరసనకారులు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. కన్నాట్ ప్లేస్ వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో అంతరాయాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు సోషల్ మీడియాకే పరిమితం కాకుండా సీజేపీ, కాంగ్రెస్ నిరసనలకు వ్యతిరేకంగా…