మన దేశంలో గాంధీ జయంతి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ రోజుల్లో, ఎన్నికల సమయంలో డ్రై డే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రాంతాన్ని బట్టి జరుపుకునే శోభాయాత్రలు, ఉత్సవాల సమయాల్లో కూడా డ్రై డే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయా రోజుల్లో వైన్ షాప్స్ ఓపెన్ చేయరు. అయితే.. బెంగుళూరులో డ్రై డేలను ఎత్తేయాలని హోటళ్ల సంఘాలు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇదేమి వింత రిక్వెస్ట్ అనుకుంటున్నారా... అదేంటో ఇప్పుడు చూడండి...
కర్ణాటకలో శాసనమండలి స్థానాలకు ఎన్నికల సందర్భంగా తమకు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని.. ఎన్నికల సందర్భంగా జారీ చేసిన డ్రై డే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని బెంగుళూరు హోటల్స్ ఆలోసియేషన్ కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఈమేరకు సీఎం డీకే శివకుమార్ కు ఓ లేఖ రాసింది బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్. అక్టోబర్ 21న సాయంత్రం 4 గంటల నుండి అక్టోబర్ 23 వరకు, ఓట్ల లెక్కింపు జరిగే అక్టోబర్ 27న డ్రై డేగా ప్రకటించారని.. ఈ ఆంక్షలు ఎత్తేయాలని ప్రభుత్వాన్ని కోరింది అసోసియేషన్.