మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇద్దరు మైతేయ్ వర్గానికి చెందిన వ్యక్తులు హత్యకు గురయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు నిరసనకు దిగారు. మృతదేహాల్లో ఒకదాన్ని ఇంఫాల్‌లోని ముఖ్యమంత్రి వై. ఖేమ్‌చంద్ సింగ్ ఇంటి ముందు ఉంచారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది.
కట్టెలు సేకరించేందుకు వెళ్లిన వారిపై కాల్పులు సోమవారం ఉదయం అడవిలో కట్టెలు సేకరించేందుకు వెళ్లిన మైతేయ్ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. వీరిని కుకీ మిలిటెంట్లు కాల్చి చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.