Manne krishank | మాక్స్బియన్ ఫార్మా కానీ, మైండ్వాల్ట్ కార్పొరేట్ స్కూల్స్ కానీ, మెడికవర్ ఆస్ప్రత్రుల మీద వస్తున్న ఆరోపణలపై అక్కడున్న మీడియావాళ్లు అడిగినపుడు రేవంత్ రెడ్డి ప్రెస్మీట్లో మొదలేమో తనను పెయిడ్ క్వశ్చన్స్ అడగకండి అన్నరు.. తర్వాతేమో ఒక్క ఆధారమన్నా చూపించండి అన్నరు. ఇవన్నీ అంశాలల్లో కూడా కొన్ని నెలల నుంచి ఆధారాలు బయటపెడుతూనే ఉన్నామని బీఆర్ ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ తెలిపారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. . ఎట్లా ఒక ఆస్పత్రిని రూ.13200కు అమ్మేస్తరు.. ఆ ఆస్పత్రిలో ఉన్న డైరెక్టర్లలో అల్లుడు మాక్స్బియన్ ఫార్మాలో ఉంటరు.. అమ్మాయి నిర్మాణాలు చేస్తున్న కార్పోరేట్ స్కూల్స్ అయిన మైండ్వాల్ట్స్లో ఉంటరు.. ఇవాళ ఇవన్నింటి మీద ప్రశ్నలు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు.. ఎదురేమో రకరకాల దుష్రచారం చేస్తరని మన్నె క్రిశాంక్ ఆరోపించారు.