Manne Krishank | మెడికవర్ ఆసుపత్రి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి దాటవేత ధోరణిపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తమ కుటుంబానికి మెడికవర్‌లో వాటాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నాయా? అంటూ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు. ఒకటి కాదు.. మూడు ఆధారాలు చూపిస్తా.. చర్చకు సిద్ధమేనా అని రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు.
రేవంత్‌రెడ్డికి సన్నిహితులుగా పేర్కొంటున్న అన్నం శరత్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, దుంప శిరీషారెడ్డికి మెడికవర్ ఆసుపత్రితో పాటు మ్యాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ట్ సంస్థల్లో షేర్లు ఉన్నాయంటూ క్రిశాంక్ వివరాలను ప్రస్తావించారు. అన్నం శరత్‌రెడ్డికి మెడికవర్ ఆసుపత్రిలో 5,08,800 షేర్లు, మ్యాక్స్ బీఎన్ ఫార్మాలో 1,08,000 షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. బ్రహ్మానందరెడ్డికి మెడికవర్‌లో 28,78,192 షేర్లు, మైండ్ వాల్ట్‌లో 65,834 షేర్లు ఉన్నాయని తెలిపారు. అలాగే దుంప శిరీషారెడ్డికి మెడికవర్‌లో 46,46,596 షేర్లు, మ్యాక్స్ బీఎన్ ఫార్మాలో 37 లక్షల షేర్లు, మైండ్ వాల్ట్‌లో 1,97,500 షేర్లు ఉన్నాయని…