అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ భారీగా నిధులు కుమ్మరిస్తున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు 276 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు అందించారు. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.2,300 కోట్లు. కాంగ్రెస్లో రిపబ్లికన్ల ఆధిపత్యం కొనసాగించేందుకు ఆయన ఈ నిధులను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని ‘న్యూయార్క్ టైమ్స్్ణ వెల్లడించగా.. మస్క్ రాజకీయ వ్యవహారాల ప్రతినిధి ఆండ్రూ రోమియో ధ్రువీకరించారు.మరోవైపు ఇటీవల భారత రాజకీయాలపై మస్క్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. స్టార్లింక్కు అనుమతుల అంశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీని ఉద్దేశించి ఆయన…
సెనేట్ రేసుపై ప్రత్యేక దృష్టిరిపబ్లికన్ సెనేట్ అభ్యర్థులకు మద్దతుగా పనిచేసే ప్రధాన సూపర్ పీఏసీ ‘సెనేట్ లీడర్షిప్ ఫండ్్ణకు మస్క్ 158 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అమెరికా రాజకీయ చరిత్రలో వ్యక్తుల నుంచి వచ్చిన భారీ విరాళాల్లో ఇదొకటిగా ‘న్యూయార్క్ టైమ్స్్ణ పేర్కొంది. ‘అమెరికా పీఏసీ్ణకి తన సూపర్ పీఏసీ (రాజకీయ ప్రచార నిధుల సంస్థ) నుంచి మరో 76 మిలియన్ డాలర్లు అందించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయానికి ఈ సంస్థ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించింది. టెక్సాస్ సెనేట్ రేసులో రిపబ్లికన్ అభ్యర్థి కెన్ పాక్స్టన్కు మద్దతిచ్చే ‘లోన్ స్టార్ లిబర్టీ పీఏసీ్ణకి 10 మిలియన్…