న్యూఢిల్లీ, అక్టోబర్ 15: వెనుకబడిన తరగతులకు చెందిన హిందువులు ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఆ వర్గానికి చెందిన కోటా ప్రయోజనాలను పొందలేరని, పూర్వపు సామాజిక వ్యవస్థలో వారు అనుభవించిన వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకు వెళ్లలేరని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాలను అనుసరించే వ్యక్తిని షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించలేమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి కేవలం మత మార్పిడి ఆధారంగా వెనుకబడిన తరగతి(ముస్లిం) క్యాటగిరీ కింద రిజర్వేషన్ కోరలేరని పేర్కొన్న మద్రాసు హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం…
మతం మారిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ను రద్దు చేసిన హైకోర్టు ఉత్తర్వును సమర్థిస్తూనే అందులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద లభించే ఎటువంటి చట్టబద్ధమైన ప్రయోజనం, రక్షణ, రిజర్వేషన్ లేదా ఇతర హక్కునైనా-ఒక వ్యక్తి హిందూ సామాజిక వ్యవస్థలో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే పొందే అవకాశం ఉంటే-ఆ వ్యక్తి ఇస్లాం, క్రైస్తవం లేదా మరే ఇతర హిందూయేతర సామాజిక వ్యవస్థలోకి మారిన తర్వాత, కేవలం గతంలో హిందూ సామాజిక వ్యవస్థలో సభ్యుడిగా ఉన్నాడనే కారణంతో అటువంటి ప్రయోజనాలను కోరడానికి లేదా పొందేందుకు వీలుండదు అని…