హనుమకొండ చౌరస్తా : వెల్నెస్ సెంటర్లో వైద్య సేవలు ( Medical services ) , నిర్వహణ మెరుగ్గా ఉండాలని వైద్యులకు, సిబ్బంది కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ( Collector Chahatbajpai ) ఆదేశించారు. సోమవారం హనుమకొండ జీఎంహెచ్ ఆవరణలో ఉన్న వెల్నెస్ కేంద్రాన్ని ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సెంటర్లోని డెంటల్, గైనిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఫార్మసీ స్టోర్, ఫార్మసీ, ల్యాబ్, తదితర విభాగాలను పరిశీలించి , పేషంట్లకు అందుతున్న వైద్య సేవలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మితను అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాలలో ఓపి చూస్తున్న వైద్యులతో ఆమె మాట్లాడారు. ఓపి సేవల నిమిత్తం వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని డాక్టర్ సుస్మిత వివరించారు.