హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): కొద్దిపాటి నిధులను వెచ్చించి చిన్నపాటి అడ్డుకట్ట వేసుకుంటే చాలు ఆ జలాలను మళ్లించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా కండ్లుండీ చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. జలాలను దిగువకు వృథాగా వదిలిపెడుతూ ప్రభుత్వం చోద్యంచూస్తున్నది.
రాజకీయాలకే పరిమితమై రైతాంగ ప్రయోజనాలను పణంగా పెడుతున్నది. కేవలం కేసీఆర్కు పేరొస్తుందనే కారణంతో సర్కార్.. రాజకీయాలకే పరిమితమై తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను పణంగా పెడుతున్నదని రైతులే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కరువు బారి నుంచి కాపాడే బదులు.. జీవధార ప్రాణహిత జలాలను వృథాగా దిగువకు వదిలేస్తున్నది. ఎల్ నినో నేపథ్యం, సర్కార్ నిర్లక్ష్యం వెరసి రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రధాన రిజర్వాయర్లు డెడ్స్టోరేజీకి చేరుకునే దశలో ఉన్నాయి. గోదావరి, కృష్ణా తదితర ప్రధాన నదులకు వచ్చిన ప్రవాహాలు అంతంతే. ఇప్పుడు పూర్తిగా ప్రవాహాలు నిలిచిపోయాయి. కానీ ఈ ఏడాది…