పెన్పహాడ్, అక్టోబర్ 14 : పెన్పహాడ్ మండలంలోని మేగ్యతండాలో ఇటీవల నూతనంగా నిర్మించిన గ్రామీణ మహిళా శక్తి భవనాన్ని డీఆర్డీఓ పీడీ సన్యాసయ్య బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవన పనులను ఆయన పరిశీలించారు. మహిళా శక్తి భవన నిర్మాణం కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా నేటికీ నయా పైస బిల్లులు రాలేదని సర్పంచ్ భూక్యా రాజు నాయక్ పీడీకి మొర పెట్టుకున్నారు. అనతికాలంలోనే ఈ పథకం కింద రాష్ట్రంలోనే మహిళా శక్తి భవనం పూర్తి చేసినా బిల్లులు రాలేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన పీడీ బిల్లులు త్వరగా మంజూరయ్యేలా…
గ్రామాల్లో రోజుకు కనీసం 100 మందికి తగ్గకుండా ఉపాధి పనులు కల్పించాలని అధికారులకు సూచించారు. కాగా సర్పంచ్ భూక్యా రాజు నాయక్ తన తండ్రి భూక్యా గోలియా, తాత జేతియా జ్ఞాపకార్థంగా ఈ భవనాల నిర్మాణం కోసం రూ.7.50 లక్షలతో 4.20 గుంటల స్థలం కొనుగోలు చేసి గ్రామ పంచాయతీకి దానం చేయడంపై సర్పంచ్ ను పీడీ అభిందించారు. రాజునాయక్ దానం చేసిన స్థలంలో మహిళా శక్తి భవనం పూర్తికాగా, పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జానయ్య, ఎంపీవో రాజేశ్వర్, ఏపీఓ రవి, ఏపీఎం అంజయ్య పాల్గొన్నారు.