న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కర్ణాటక ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాలని కోరుతూ కనీసం 37 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. తాము మరణించామని పేర్కొంటూ వారు ఈ దరఖాస్తులు సమర్పించారు. అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి పేరు, తొలగించాల్సిన పేరు ఒకటేనని, అంతేగాకుండా వారి పేర్లలోని మొదటి అక్షరాలు(ఇంటి పేర్లు) కూడా సరిపోలుతున్నట్టు తెలుస్తున్నది. మరో విచిత్రమైన ఉదంతంలో 334 జంటలకు చెందిన వ్యక్తులు ఒకరినొకరు మరణించినట్టు ప్రకటించుకున్నారు. ఒక వ్యక్తి అవతలి వ్యక్తి మరణించాడని పేర్కొంటూ ఆ వ్యక్తి పేరును తొలగించాల్సిందిగా ‘ఫామ్-7’ను సమర్పించగా, మరణించినట్టు పేర్కొన్న ఆ రెండో వ్యక్తి కూడా అదే తరహా…
ముసాయిదా జాబితాలో చేరికలు కర్ణాటక అంతటా జూన్ 30న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ ప్రారంభం కాకముందే మరణాన్ని కారణంగా పేర్కొంటూ తమ పేర్లను తొలగించవలసిందిగా కోరే దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయి. అయితే ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రచురితమైన తర్వాత కూడా కనీసం మూడు అటువంటి దరఖాస్తులు అందాయి. అంటే ఆ పేర్లు ముసాయిదా జాబితాలలో కూడా ఉన్నాయి. ఈ మూడు కేసుల గురించి బూత్ స్థాయి అధికారులు(బీఎన్ఓ), సహాయ ఎన్నికల నమోదు అధికారులను(ఏఈఆర్ఓ) సంప్రదించగా వారు కూడా వీటిని ధృవీకరించారు. ఈ ఘటనలు మాగడి, సండూరు, బ్యాటరాయనపుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటుచేసుకోగా వీటికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లను…