విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద, సంజయ్ నగర్ లోని బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద జరిగిన నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి 11 నామినేషన్లు రావడం జరిగిందని తెలిపారు. ఇందులో టిడిపి పార్టీ 6 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దరూ, కాంగ్రెస్ పార్టీ ఒకరు, నవతరం పార్టీ ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు వేయడం జరిగిందన్నారు. 48 వార్డు మెంబర్ పదవులకు దాఖలైన నామినేషన్లు; అదేవిధంగా పట్టణంలోని 48 వార్డుల్లో కౌన్సిలర్ పదవులకు 175 నామినేషన్లు రావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు.…