హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి మూడేండ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు. గత ఏడాది దసరా నుంచి అదిగోఇదిగో మంత్రివర్గ విస్తరణ అంటూ చెప్తూనే ఉన్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులు ఢిల్లీకి, హైదరాబాద్కు తిరిగితిరిగి విసిగిపోయారు. తొలుత కేరళ, బెంగాల్ ఎన్నికల తర్వాత విస్తరణ అన్నారు.. ఆపై సంక్రాంతికి అన్నారు.. తర్వాత ఉగాదికి ఉంటుందని చెప్పారు. నిన్న మొన్నటివరకు దసరాకు పక్కా అని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయించుకున్నారు. దసరా పండుగ కూడా వచ్చేసింది కానీ, ఎక్కడా మంత్రివర్గ విస్తరణ ఊసే…
అంతేకాదు.. కనుచూపుమేరలో విస్తరణ చేస్తారన్న నమ్మకం కూడా ఎమ్మెల్యేల్లో లేకుండాపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు కేసీఆర్ పూర్తిస్థాయి మంత్రివర్గంతో పాలన సాగించారని, కాంగ్రెస్ హయాంలో మూడు బెర్తులు ఎప్పుడూ ఖాళీగా ఉంటున్నాయని వాపోతున్నారు. కీలకమైన శాఖలన్నీ సీఎం దగ్గరే పెట్టుకోవడంతో పాలన కుంటుపడిందని పార్టీ వర్గాలు, అధికారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి మూడేండ్లయినా కనీసం మంత్రివర్గాన్ని కూడా పూర్తిస్థాయిలో నింపలేకపోతున్న అసమర్థ పార్టీగా కాంగ్రెస్ నిలిచిపోతుందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మిగిలిన రెండేండ్లలో చివరి ఏడాదంతా ఎన్నికల హడావుడి…