2026 నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై ట్రంప్ అసంతృప్తితాను 8 యుద్ధాలు ఆపానని, 8 బహుమతులు రావాలని వ్యాఖ్య2026 సంవత్సరానికి గాను తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను పరిష్కరించిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ బహుమతి చొప్పున మొత్తం ఎనిమిదిసార్లు తనకు ఆ పురస్కారం రావాల్సిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సిరాక్యూస్లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో నోబెల్ కమిటీని, నార్వేను లక్ష్యంగా చేసుకున్నారు.ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్షిణాఫ్రికాకు చెందిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ కమిషనర్ నవీ పిళ్లైకి దక్కిన…