హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. దరఖాస్తుల పరిశీలన కూడా నత్తనడకను తలపిస్తున్నది. సీఈవో కార్యాలయం అధికారిక నివేదిక ప్రకారం.. సోమవారం సాయంత్రం వరకు మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది జిల్లాల నుంచి మొత్తం 1,84,883 ఫామ్-18 దరఖాస్తులు అందాయి. వీటిలో 2,046 ఆమోదం పొందగా, 52 తిరసరణకు గురయ్యాయి. ఇంకా 1,82,785 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
అంటే అందిన దరఖాస్తుల్లో సుమారు 98.9 శాతం పరిషారానికి నోచుకోలేదు. దరఖాస్తుల పరిషారంలో ఈ స్థాయి జాప్యం కొనసాగితే, గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలో పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నది. ఈ పరిధిలో 2,37,058 దరఖాస్తులు అందగా, 6,550 మాత్రమే ఆమోదం పొందాయి. 615 తిరసరించారు. మరో 2,29,893 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.