రాత్రి నూడిల్స్ తిన్న కుటుంబం మొత్తం తెల్లారే సరికి విగత జీవులుగా పడిపోవడం కలకలం రేపింది. ఫ్యామిలీ మొత్తం పడుకున్నోళ్లు పడుకున్నట్లే చనిపోవడం ఆ కుటుంబం, బంధువుల్లో తీరని వేదనని నింపింది. 2026 అక్టోబర్ 17న నోయిడాలో జరిగిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రేటర్ నోయిడాలోని రబూపుర పరిధిలోని నగ్ల శ్రీ పాదం గ్రామానికి చెందిన ఒక కుటుంబం మొత్తం శనివారం (అక్టోబర్ 17) ఉదయం జరిగింది ఈ ఘటన. భర్త మహేష్ (36), భార్య లలిత (33) తో సహా ముగ్గురు పిల్లలు లడ్డు (12), మిస్తి (8), సాక్షి (4) పడుకున్నోళ్లు పడుకున్నట్లే చనిపోయారు.